Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం స్మగ్లింగ్ కేసు- కన్నడ సినీ నటి రన్యా రావు అరెస్ట్.. 14.8 కిలోల బంగారాన్ని దుస్తుల్లో దాచిపెట్టి..?

సెల్వి
బుధవారం, 5 మార్చి 2025 (12:11 IST)
Ranya Rao
కన్నడ సినీ నటి రన్యా రావును బంగారం స్మగ్లింగ్ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం రాత్రి ఆమె వద్ద 14.8 కిలోల బంగారం దొరికిందని అధికారులు తెలిపారు. ఐఏఎస్ అధికారి కుమార్తె అని చెప్పుకుంటూ ఈ కన్నడ నటి రన్యా రావు దుబాయ్ నుండి 14 కిలోల బంగారంతో బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడింది.
 
దుబాయ్ నుండి ఎమిరేట్స్ విమానంలో రన్యా రావు వచ్చారు. ఇంకా ఆమె విదేశీ ప్రయాణాలపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఆమె భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తుందని తెలిసి.. ఆమెను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 
 
ఈ గోల్డ్ స్మగ్లింగ్‌లో భాగంగా భారీ మొత్తంలో బంగారాన్ని ధరించి, మిగిలిన మొత్తాన్ని తన దుస్తులలో తెలివిగా దాచిపెట్టినట్లు సమాచారం. రావు 15 రోజుల్లో నాలుగు సార్లు దుబాయ్‌కు వెళ్లి రావడంతో అధికారులలో అనుమానం పెరిగింది. కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవడానికి ఆమె తన ప్రభావాన్ని ఉపయోగించాలని యోచిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
gold
 
ఇకపోతే.. మాణిక్య సినిమాలో నటుడు సుదీప్‌తో కలిసి రన్యా రావు నటించారు. ఈ కేసులో ఏ ఒక్క నిందితుడు తప్పించుకోకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments