Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఐవీఆర్
ఆదివారం, 15 జూన్ 2025 (19:06 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకె నాయకురాలు కనిమొళి కల్లు తాగారు. దీనికి కారణం లేకపోలేదు. కల్లుగీత కార్మికుల కష్టాలను తీర్చేందుకు వారు పలు కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతోమంచిది. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు వారిరువురూ తాటిరేకలో కల్లు పోయించుకుని తాగేశారు.
 
తాటికల్లు ఆరోగ్య ప్రయోజనాలు
అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్‌ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చెట్టు నుంచి అప్పుడే తీసిన కల్లు తాగితేనే ఈ ఫలితాలు అందుతాయి. చెట్ల నుంచి కల్లు తీశాక కొన్ని గంటలు అలాగే ఉంచితే పులిసిపోయి ఆల్క్‌హాల్‌గా మారిపోతుంది. 
 
దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం. అందుచేత చెట్టు నుంచి అప్పుడే తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తాటిచెట్టు ప్రసాదించే కల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తాటికల్లులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. 
<

பதனீரில் சக்கரை போட்டு இருக்கா என்று கேட்கும் ஒரே கும்பல் நீதாம்லே மக்கா https://t.co/8oVZZYfYvf pic.twitter.com/NFwj4tRzyM

— Velmurugan S (@Velu_Thoughts) June 15, 2025 >
మసాలా, మాంసాహారాలు, జంక్ ఫుడ్స్‌ వంటి ఆహారపు అలవాట్లతో అస్తవ్యస్తమైన మానవ జీర్ణ వ్యవస్థను ఈ తాటికల్లు బాగుచేస్తుంది. శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే పరగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని మన పూర్వికులు ఏనాడో చెప్పారు. ప్రస్తుతం ఇది నిజమని పరిశోధనల్లో కూడా తేలిపోయింది. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments