Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ టు తీహార్ : కన్హయ్య కుమార్ అనుభవాలు పుస్తక రూపంలో..

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (08:49 IST)
ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కమార్. యూనివర్శిటీలో పార్లమెంట్ దాడి కేసులో దోషిగా తేలిన ముద్దాయి అఫ్జల్‌ గురు వర్థంతి సందర్భంగా జేఎన్‌యూ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతివ్యతిరేక నినాదాలకు పాల్పడ్డారంటూ కన్హయ్యతో పాటు మరికొందరు విద్యార్థులు ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశద్రోహం ఆరోపణల కింద కన్హయ్యను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఒక్కసారి జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చాడు. 
 
అయితే, తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా 'బీహార్‌ టు తీహార్‌' పేరుతో పుస్తకం రాయనున్నాడు. తర్వాతి సెమిస్టర్‌ ప్రారంభమయేనాటికి పుస్తకాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు. కన్హయ్య స్వస్థలం బీహార్‌లోని బెగుసరయ్‌ జిల్లా బెతియా గ్రామం. ఢిల్లీలోని జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. 
 
కాగా ఓ మామూలు గ్రామం నుంచి ఢిల్లీ చేరుకోడానికి తాను ఎదుర్కొన్న సమస్యలు.. అక్కడి నుంచి జైలుకు వెళ్లిన ఘటనల ఆధారంగా ఈ పుస్తకం రాయనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే ఓ పబ్లిషర్‌తో ఒప్పందం కూడా చేసుకున్నట్లు కన్హయ్య తెలిపాడు. తాను ఎదుర్కొన్న సవాళ్లతో పాటు.. సామాజిక అంశాలను కూడా ఇందులో ప్రస్తావిస్తానని తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments