Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా అలా దొరికిపోయింది

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (07:26 IST)
తరుచూ వివాదాల్లో నిలిచే బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఈ మధ్య కాలంలో హీరో సుశాంత్‌ మరణంతో మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీకే కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. అయితే ఓ టివి డిబేట్‌లో శివసేనను కార్నర్‌ చేయబోయి తనే తప్పులో కాలేశారు.
 
గత ఎన్నికల్లో తాను శివసేనకు బలవంతంగా ఓటేశానని అన్నారు. తాను బిజెపి మద్దతురాలినని, కానీ మొన్నటి ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయలేకపోయానని చెప్పారు. బిజెపి - శివసేన పొత్తు వల్ల తాను ఓటు వేసే నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి నిల్చున్నారని, ఇవిఎంలో బిజెపి బటన్‌ కనపడలేదని, చేసేది లేక శివసేనకు ఓటు వేశానని పేర్కొన్నారు.

అయితే కమ్లేశ్‌ సుతార్‌ అనే జర్నలిస్ట్‌ కంగనా చేసిన వ్యాఖ్యలను తప్పుడు వ్యాఖ్యలుగా నిర్ధారించారు. మహారాష్ట్ర సిఇఒ డేటా ప్రకారం.. 'కంగనాకు వెస్ట్‌ బాంద్రాలో ఓటు హక్కు ఉంది. కాగా అక్కడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ఆశిశ్‌ షేలార్‌, లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి పూనమ్‌ మహాజన్‌ పోటీ చేసి గెలిచారు.

ఈ రెండు స్థానాల్లో బిజెపి-శివసేన కలిసి పోటీ చేసినప్పటికీ రెండు స్థానాల్లో బిజెపి అభ్యర్థులే పోటీ చేశారు. శివసేన అభ్యర్ధులే పోటీ చేయని చోట ఆమె శివసేనకు ఎలా ఓటు వేస్తుంది ' అని కమ్లేశ్‌ ప్రశ్నించారు. పాపం కంగనా! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments