Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు భవిష్యత్తులో ఇక వచ్చేది లేదు.. బాలీవుడ్ జంట

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (18:01 IST)
పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ నెల 23, 24 తేదీల్లో కైఫీ అజ్మీ కల్చరర్ కార్యక్రమం జరగాల్సి వుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ జంట షబానా అజ్మీ, జావెద్ అక్తర్ హాజరుకావాల్సి వుంది. ఉగ్రదాడికి నిరసనగా ఈ కార్యక్రమానికి తాము రావడం లేదని వీరిద్దరూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. భవిష్యత్తులో పాకిస్థాన్‌లో జరిగే ఏ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరుకాబోమని స్పష్టం చేశారు. 
 
జమ్మూకాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధిగా చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సైనికుల రాకపోకల సందర్భంగా సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న సైన్యాధికారుల నిర్ణయం తమలో కొందరి ప్రాణాల మీదికి తెచ్చింది. 
 
సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌ వెళ్తుండగా ఆ దారిలో పౌరవాహనాలను అనుమతించడం మానవ బాంబుకు గొప్ప అవకాశంగా మారిందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ చిన్నపొరపాటు వల్లే సీఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోయి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments