Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్‌కు పిచ్చిపట్టింది.. మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలి : బీజేపీ

దేశంలో హిందూ ఉగ్రవాదులు పెరిగిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన సినీ హీరో కమల్ హాసన్‌పై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. కమల్ హాసన్‌కు పిచ్చిపట్టిందంటూ మండిపడుతున్నారు. కమల్ మానసిక ఆరోగ్యం బాగోలేద

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (16:36 IST)
దేశంలో హిందూ ఉగ్రవాదులు పెరిగిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన సినీ హీరో కమల్ హాసన్‌పై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. కమల్ హాసన్‌కు పిచ్చిపట్టిందంటూ మండిపడుతున్నారు. కమల్ మానసిక ఆరోగ్యం బాగోలేదని... వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించాలని బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ అన్నారు. 
 
కమల్ హాసన్ వ్యాఖ్యలపై ఆయన ఢిల్లీలో స్పందిస్తూ, హిందూ ఉగ్రవాదం అనే పదం వాడినందుకు కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే కమల్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కమల్‌పై పరువునష్టం దావా అంశాన్ని కూడా తమిళనాడు బీజేపీ శాఖ పరిశీలిస్తోందన్నారు. 
 
అంతకుముందు కమల్ హాసన్ ఓ తమిళ పత్రికకు రాసిన వ్యాసంలో దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని కమల్ ఆరోపించారు. ఈ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుజరాత్, యూపీ, రాజస్థాన్‌లలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. 
 
హిందూ సంస్థలు గతంలో హింసకు పాల్పడేవికాదని, మాటలతోనే ప్రత్యర్థులను ఎదుర్కొనేవని, ఇప్పుడు మాత్రం భౌతిక దాడులకు కూడా తెగబడుతున్నాయని కమల్ తన కథనంలో పేర్కొన్నారు. హిందూ ఉగ్రవాదులను కొందరు వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వేడి పుట్టిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments