Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు రెండో పెళ్లి చేసి పెట్టిన భార్య.. మగ సంతానం కోసం బాలికను కిడ్నాప్ చేసి?

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (11:04 IST)
భర్తకు రెండో పెళ్లి చేసేందుకు భార్య తెగించింది. తనకు ముగ్గురు అమ్మాయిలు పుట్టడంతో వారసుడు కావాలని ఆమె తపించింది. ఎలాగైనా వారసుడు కావాలన్న ఉద్దేశంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ఓ బాలికను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను ఓ గుడికి తీసుకెళ్లి తన భర్తతో వివాహం జరిపించింది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కడలూరు, దిట్టకుడి ఉల్లవయ్యంగుడికి చెందిన అశోక్‌కుమార్-చెల్లకిళి దంపతులు ముగ్గురు అమ్మాయిలు వున్నారు. ఈ దంపతులు మగపిల్లాడి కోసం స్థానికంగా నివసించే ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నారు. ఈ నెల 7న అమ్మాయి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి బాలికను తమతోపాటు ఆలయానికి తీసుకెళ్లారు.
 
అందరూ కలిసి గుడికి చేరుకున్న తర్వాత చెల్లకిళి తమ ప్లాన్‌ను అమలు చేసింది. తన భర్తతో ఆ అమ్మాయికి పెళ్లి చేసింది. అయితే, గుడికి వెళ్లిన తమ కుమార్తె మూడు రోజులైనా రాకపోవడంతో అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు చెల్లకిళిని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె చెప్పిన సమాధానం విని విస్తుపోయిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె భర్త అశోక్ కుమార్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments