Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ దీపక్ మిశ్రా

భారత 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ దీపక్ మిశ్రా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. నిన్నమొన్నటి వరకూ సీజేఐగా ఉన్న జస్టిస్ జేఎస్ ఖెహర్ స్థానంలో ఆయన క

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (12:37 IST)
భారత 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ దీపక్ మిశ్రా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. నిన్నమొన్నటి వరకూ సీజేఐగా ఉన్న జస్టిస్ జేఎస్ ఖెహర్ స్థానంలో ఆయన కొత్త సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ దీపక్ మిశ్రాతో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. 
 
సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అయిన దీపక్ మిశ్రా 45వ సీజేఐగా 14 నెలల పాటు పదవిలో ఉంటారు. అక్టోబర్ 2018న పదవీ విరమణ చేస్తారు. 1977లో ఒడిశా హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన దీపక్ మిశ్రా 1977లో ఒడిశా హైకోర్టుకు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 
 
అనంతరం 1997లో మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అదే ఏడాది చివర్లో శాశ్వత జడ్జి అయ్యారు. 2009లో పాట్నా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అయ్యారు. 2010లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. మిశ్రా తన సుదీర్ఘ కెరీర్‌లో పలు కీలక తీర్పులు ఇచ్చారు. 
 
కాగా, ట్రిపుల్ తలాఖ్, ప్రైవసీ హక్కు (వ్యక్తిగత గోప్యత) వంటి తీర్పుల ద్వారా న్యాయవ్యవస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో జస్టిస్ మిశ్రా సీజేఐగా బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రెండు అంశాలపై జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని ధర్మాసనం చారిత్రత్మాక తీర్పులను వెలువరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments