రోజాపై బోండా 'గుండు' సవాల్ కలిసొచ్చిందా? కాకినాడలో కూడా...

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సమయంలో తెలుగుదేశం, వైకాపా పార్టీల నాయకులు పరస్పరం చేసుకున్న మాటల దాడి గురించి చెప్పక్కర్లేదు. వైకాపా ఎమ్మెల్యే రోజా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, నంద్యాల ఎన్నికలో తెదేపా ఘోర పరాజయం పాలవుతుం

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (12:34 IST)
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సమయంలో తెలుగుదేశం, వైకాపా పార్టీల నాయకులు పరస్పరం చేసుకున్న మాటల దాడి గురించి చెప్పక్కర్లేదు. వైకాపా ఎమ్మెల్యే రోజా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, నంద్యాల ఎన్నికలో తెదేపా ఘోర పరాజయం పాలవుతుందని చేసిన వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆమెకు అప్పట్లో ఓ సవాల్ కూడా విసిరారు.
 
నంద్యాలలో తెదేపా ఓడితే తను గుండు చేయించుకునేందుకు సిద్ధంగా వున్నాననీ, అదే వైసీపి ఓడిపోతే రోజా కూడా గుండు చేయించుకునేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్ పైన రోజా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ బోండా ఉమ సవాల్ మాత్రం బాగా పబ్లిసిటీ అయ్యింది. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.... హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బహిరంగంగా ఉరి తీసినా తప్పులేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా దెబ్బకొట్టాయని అంటున్నారు. 
 
మొత్తమ్మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సరళిలో చేసిన తప్పిదాల వల్ల చాలా వరకూ నెగటివ్ వేవ్ ప్రజల్లోకి వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే కాకినాడ మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో అక్కడ ఎమ్మెల్యే రోజా చేస్తున్న వ్యాఖ్యలపై మరోసారి బోండా ఉమ తన 'గుండు' సవాల్ మరోసారి విసురుతారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూడాలి... ఏం జరుగుతుందో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments