జూలై వచ్చింది... వ్యాక్సీన్ ఎక్కడ?: రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (09:41 IST)
మేలో దేశ వ్యాప్తంగా ప్రారంభిస్తామన్న వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్దేశించుకున్న అంచనాలను కేంద్ర ప్రభుత్వం  అందుకోలేక పోయిందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

ఈ విషయమై శుక్రవారం తన అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘జూలై వచ్చింది, వ్యాక్సీన్ ఇంకా రాలేదు’’ అని హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ‘‘వ్యాక్సీన్ ఎక్కడ’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను రాహుల్ జత చేశారు.

మోదీ ప్రభుత్వం జూలై నాటికి దేశ వ్యాప్తంగా 12 కోట్ల మందికి పూర్తి స్థాయిలో టీకా వేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఐదు కోట్ల మందికి పై చిలుకు మాత్రమే పూర్తి అయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మాటలు వట్టి నీటిమూటలయ్యాయని జూలై నాటికి లక్ష్యంగా పెట్టుకున్న వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని రాహుల్ విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments