Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 ఏళ్లకే న్యాయమూర్తి..!

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (17:21 IST)
దేశంలోనే అత్యంత చిన్న వయసులో న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టబోతున్న వ్యక్తిగా రాజస్థాన్‌ యువకుడు రికార్డు సృష్టించాడు.

మయాంక్‌ ప్రతాప్‌ అనే 21ఏళ్ల యువకుడు 2019 రాజస్థాన్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌(ఆర్‌జేఎస్‌) పరీక్షలో టాపర్‌గా నిలిచి సాధించి న్యాయమూర్తి పదవికి అర్హత సాధించాడు. జైపూర్‌లోని మాన్‌సరోవర్‌కు చెందిన మయాంక్‌ రాజస్థాన్‌ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సును గత ఏప్రిల్‌లో పూర్తి చేసి పట్టా పొందాడు.

అనంతరం నిర్వహించిన రాజస్థాన్‌ జ్యుడిషియల్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. న్యాయమూర్తి కాబోతున్న పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

గతంలో ఆర్‌జేఎస్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత వయసు 23ఏళ్లు ఉండేది. కాగా ఈ ఏడాదే రాజస్థాన్‌ హైకోర్టు దాన్ని 21ఏళ్లకు తగ్గించగా సరిగ్గా అదే వయసులో అతడు ఇందులో అర్హత సాధించడం విశేషం.

ఈ సందర్భంగా మయాంక్‌ ప్రతాప్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఆర్‌జేఎస్‌ పరీక్ష ఉత్తీర్ణత సాధించడానికి 13 గంటలు చదివాను. ఈ ఫలితంపై నేను ఎంతో సంతోషించాను.

నా అభిప్రాయం ప్రకారం.. మంచి న్యాయమూర్తి కావాలంటే దయాగుణం ఎంతో ముఖ్యమైంది. ఎలాంటి బాహ్య ప్రభావాలకు లోను కాకూడదు’ అని తెలిపాడు. తాజాగా విడుదలైన ఆర్‌జేఎస్‌ ఫలితాల్లో 50శాతానికిపైగా మహిళలు అర్హత సాధించారు.

ఈ సందర్భంగా పరీక్షలో టాపర్‌గా నిలిచిన మయాంక్‌తో పాటు తన్వీమాధుర్‌, దీక్షా మదన్‌లను ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గహ్లోత్‌ ట్విటర్‌ ద్వారా అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments