Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చుకున్నావ్ కదా.. ఇకవదిలెయ్... ఎడిటర్‌ను హత్య చేసిన లేడీ రిపోర్టర్

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (11:57 IST)
ఇటీవల ముంబైలో జరిగిన ఎడిటర్ నిత్యానంద్ పాండే హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన వద్ద పని చేసే ఓ లేడీ రిపోర్టర్‌ను లైంగికంగా వేధించినందుకుగాను నిత్యానంద్ హత్యకు గురైనట్టు తేల్చారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, న్యూస్ పోర్టల్ ఎడిటర్ నిత్యానంద్ పాండే (44) ఇటీవల హత్యకు గురయ్యాడు. ఇది ముంబైలో కలకలం రేపింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 
 
న్యూస్ పోర్టల్ కార్యాలయంలో విలేఖరి లేదా సబ్‌ఎడిటర్‌గా ఇంటర్న్ షిప్ చేస్తున్న యువతి రెండేళ్లుగా పనిచేస్తోంది. సదరు యువతిని నిత్యానంద పాండే ఎన్నో మార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడు. తనను ఇక వదిలేయాలని ప్రాధేయపడింది. అప్పటికీ మాట వినకపోవడంతో ఆమె ఎదురుతిరిగింది. దీంతో ప్రమోషన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో ఆమె ముద్రణా విభాగంలో పనిచేసే సతీశ్ మిశ్రా సాయం కోరింది. అప్పటికే పాండే తనకు వేతనాలు ఆలస్యంగా ఇస్తున్నాడన్న ఆగ్రహంతో ఉన్న సతీశ్ ఆమెకు సహకరించేందుకు అంగీకరించాడు.
 
సతీశ్‌తో కలిసి పాండేను హత్య చేయాలని ప్లాన్ చేశారు. తమ ప్లాన్‌లో భాగంగా, పాండేను ముంబైకి 8 కిలోమీటర్ల దూరంలోని ఉత్తర భయందర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. వెళ్తున్న సమయంలో వాహనంలోనే మత్తుమందు కలిపిన మద్యం తాగించారు. స్పృహలో లేని పాండేను తాడు సాయంతో గొంతు బిగించి చంపి, భివండీ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సతీశ్ మిశ్రాతో పాటు.. ఆ లేడీ రిపోర్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం