Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాటలతో మాయచేసి.. టీలో మత్తుమందు కలిపి.. శీలాన్ని దోచుకున్నాడు...

Advertiesment
మాటలతో మాయచేసి.. టీలో మత్తుమందు కలిపి.. శీలాన్ని దోచుకున్నాడు...
, సోమవారం, 18 మార్చి 2019 (15:37 IST)
ఆ మహిళను మాటలతో మాయచేశాడు. సమస్యలను పరిష్కరిస్తాను ఇంటికి రమ్మన్నాడు.. ఆయన మాటలు నమ్మి ఇంటికెళ్తే తేనీరులో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఫ్లోరిడాకు చెందిన జీన్ ఫిలిప్స్ అనే వ్యక్తికి దైవభక్తి ఎక్కువ. దీంతో ఆయన వద్దకు అనేక మంది స్థానికులు వచ్చిన తమ సమస్యల పరిష్కారం కోసం సలహాలు సూచనలు అడిగి వెళుతుంటారు. ఇదేవిధంగా ఓ మహిళ ఆయన వద్దకు వెళ్లింది. ఆమెను మాటలతో మాయచేశాడు. 
 
తన మాట దేవుడు వింటాడని, తను ప్రార్థిస్తే ఖచ్చితంగా ఎవరి కష్టాలనైనా ఇట్టే తీర్చేస్తాడని ఆ మహిళను నమ్మించాడు. ఆయన మాటలను గుడ్డిగా నమ్మిన ఆ మహిళ ఓ రోజున ఆ వ్యక్తి ఇంటికి పిలవడంతో వెళ్లింది. 
 
ఇంటికొచ్చిన ఆమెను సోఫాలో కూర్చోబెట్టి తేనీరు ఇచ్చింది. ఈ టీ తాగడంతో ఆ మహిళ స్పృహ కోల్పోయింది. రెండు గంటలు తర్వాత మెలకువ వచ్చి చూస్తే ఇంట్లోని పడగ గదిలో నగ్నంగా ఉంది. దీంతో తాను మోసపోయానని, తాను అత్యాచారానికి గురైనట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, గతంలో కూడా అనేక మంది మహిళలను ఇదేవిధంగా మోసం చేసినట్టు తేలింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకాను హత్య చేసి ఆస్పత్రిలో చేరిన పరమేశ్వర్ రెడ్డి?