Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనిగుడ్లు పీకేసి ... చెట్టుకు ఉరివేరి ... బీజేపీ నేత కుమార్తె దారుణ హత్య

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (10:33 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీ నేత కుమార్తె దారుణ హత్యకు గురైంది. ఆమె రెండు కళ్లు పీకేసి, చెట్టుకు ఉరివేసి హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని పంకీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధబార్ గ్రామంలో నివసిస్తున్న బాలిక స్థానిక బిజెపి నాయకుడి కుమార్తె. ఐదుగురు పిల్లల్లో పెద్ద కుమార్తె అయిన ఆమె.. ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. 
 
ఈమెను కొందరు వ్యక్తులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. కనుగుడ్లు పీకేసి, చిత్రహింసలకు గురిచేసి ఆపై.. చెట్టుకు ఉరివేసి చంపేశారు. ఈ అమానుష ఘటన జార్ఖండ్‌లో పలాము జిల్లా లాలిమతి అడవి ప్రాంతంలో వెలుగు చూసింది. 
 
బాలిక హత్యకు గురైన ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డుల ఆధారంగా.. ఈ హత్య కేసులో ప్రదీప్ కుమార్ సింగ్ ధనుక్(23)ను అరెస్ట్ చేశారు. 
 
కాగా, హత్యకు గురైన బాలిక జూన్ 7వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. దాంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు పంకీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు తప్పిపోయిన బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. చివరికి బుధబార్ గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో చెట్టుకు మృతదేహమై కనిపించింది. పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకు పరిశీలించిన మృతదేహం.. తప్పిపోయిన బాలికదే అని నిర్ధారించుకున్నారు.
 
దుండగులు బాలికను అత్యంత కిరాతకంగా కొట్టి చంపినట్లు ఆమె శరీరంపై ఉన్న గాయాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, తమ కూతురుని అత్యాచారం చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉంటే బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments