Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకేమైంది.. నేనెందుకు ఇక్కడున్నా... మెల్లిగా వైద్యులతో మాట్లాడిన జయలలిత

తీవ్ర అనారోగ్యంతో కారణంగా గత 19 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నారు. ఇందులోభాగంగా, ఆమె ఆదివారం సైగలు చేశారు. తనకు ఏమైంది..

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (07:46 IST)
తీవ్ర అనారోగ్యంతో కారణంగా గత 19 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నారు. ఇందులోభాగంగా, ఆమె ఆదివారం సైగలు చేశారు. తనకు ఏమైంది.. నేనెందుకు ఇక్కడ ఉన్నానంటూ వైద్యులను మెల్లిగా ప్రశ్నించినట్టు ఆస్పత్రి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వార్త కోట్లాది మంది అన్నాడీఎంకే శ్రేణులను ఆనందోత్సవాల్లో ముంచెత్తింది. 
 
జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా గత నెల 22వ తేదీన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం జయలలిత చేరిన విషయం తెల్సిందే. ఆమెకు డాక్టర్‌ శివకుమార్‌ నేతృత్వంలోని అపోలో వైద్య బృందం, లండన్ వైద్యుడు డాక్టర్‌ జాన్ రిచర్డ్‌ బీలే, ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు చికిత్స చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చేస్తున్న వైద్యంతో ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది. 
 
ప్రస్తుతానికి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న జయ.. ఆదివారం మధ్యాహ్నం కళ్లు తెరవడంతో పాటు మెల్లిగా వైద్యులతో మాట్లాడినట్లు సమాచారం. అంతేగాక తనకేమైందంటూ సైగలతో వైద్యులను ఆమె ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వార్త మంత్రులకు అన్నాడీఎంకే కార్యకర్తలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. పదిరోజుల తర్వాత పార్టీ వర్గాల్లో ఉత్సాహం కనిపించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments