Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాసీపొరలో ఎన్‌కౌంటర్ : నలుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (09:44 IST)
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా లాసీపొరలో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గత ఫిబ్రవరి నెల 14వ తేదీన పుల్వామా జిల్లాలోని లాథపొరాలో భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొత్తం 40 మంది భద్రతా సిబ్బందితో పాటు.. ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామూన జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జగిగాయి. ఈ భీకర కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ప‌క్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కాశ్మీర్ సాయుధ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 
 
ఈ క్రమంలో జవాన్లపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముష్కరుల దా
డిని తిప్పికొట్టిన భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమర్చారు. అయితే ఈ కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది కూడా గాయపడ్డారు. సంఘటనా స్థలిలో రెండు ఏకే రైఫిల్స్‌, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఒక తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments