Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టుకు నిర్వహణకు నిబంధనలు ఇవే... తమిళనాడు సర్కారు జీవో జారీ

తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహణకు నిబంధనలతో కూడిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో పేర్కొన్న నిబంధనలు ఇలా ఉన్నాయి. జల్లికట్టు నిర్వహణకు జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా వినతిపత

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (11:39 IST)
తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహణకు నిబంధనలతో కూడిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో పేర్కొన్న నిబంధనలు ఇలా ఉన్నాయి. జల్లికట్టు నిర్వహణకు జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలి. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులు, వీరులకు జిల్లా కలెక్టర్‌ నుంచి ముందే అనుమతి పొందాలి. జల్లికట్టుకు అనుమతులు జారీ చేసే కలెక్టర్‌ పోటీలు జరిగే ప్రాంతాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి.
 
రెవెన్యూ, పశుసంవర్థక, పోలీస్‌, ఆరోగ్యశాఖలకు చెందిన అధికారులతో ఓ కమిటీని నియమించి, పోటీలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా అని కలెక్టర్‌ పర్యవేక్షించాలి. జల్లికట్టు పోటీలో పాల్గొనే ఎద్దులకు మద్యం, మత్తు పదార్ధాలు ఇవ్వలేదని, పశువులు ఆరోగ్యంగానే ఉన్నాయని పశుసంవర్థక శాఖ వైద్యులు ధృవీకరించాలి.
 
పోటీలో పాల్గొనే ముందు ఎద్దులకు 20 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. ఒక్కో ఎద్దుకు 60 చదరపు అడుగుల చోటు కల్పించి వాటికి మేత, నీరు ఇవ్వాలి.
 
ఎద్దులను నిలిపే ప్రాంతంలో పందిరి వేసి ఎండ వేడిమి తగలకుండా చూసుకోవాలి. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. అవసరమైన ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చి పోటీలను నమోదు చేయాలి.
 
వాడివాసల్‌ ప్రాంతానికి ఎద్దులను తీసుకువెళ్లి పరిగెత్తించే ముందు వాటి ముక్కుతాడును యజమానే తొలగించాలి. వాడివాసల్‌ నుంచి బయటకు పరుగెత్తే ఎద్దులను యువకులు అడ్డుకోకూడదు. పరిగెత్తే ఎద్దులను కొమ్ములు, తోకపట్టుకొని అదుపు చేయరాదు. వాడివాసల్‌ నుంచి పోటీ ముగిసే ప్రాంతం వరకు ఎద్దులు పరిగెత్తు సమయం 60 సెకన్ల నుంచి 120 సెకన్లలోపు ఉండాలి. 
 
ఎద్దులను అదుపుచేసే యువకులకు వైద్యపరీక్షలు నిర్వహించి యూనిఫాం, గుర్తింపుకార్డు కలెక్టర్‌ పంపిణీ చేయాలి. పోటీలు జరిగే ప్రాంగణంలో గాయపడే ఎద్దులు, వీరులకు చికిత్సలు అందించేందుకు నిర్వాహకులు అంబులెన్స, వైద్యులు, పశుసంవర్ధక శాఖ వైద్యులను అందుబాటులో ఉంచుకోవాలి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments