Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిడితే భరించాం.. గెంటేస్తే సహించాం.. మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతాం : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువతకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. గాంధీజీని ప్రేమిస్తాం. అంబేద్కర్‌ని ఆరాధిస్తాం.

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (11:09 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువతకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. గాంధీజీని ప్రేమిస్తాం. అంబేద్కర్‌ని ఆరాధిస్తాం. సర్దార్ పటేల్‌కి సెల్యూట్ చేస్తాం. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. కానీ, తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూపోతే చూస్తూ కూర్చోం.. మెడలు వంచి కింది కూర్చోపెడతాం అంటూ ట్వీట్ చేశారు. 
 
అంతేనా తిడితే భరించాం.. విడగొట్టి గెంటేస్తే సహించాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతాం అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ యువత కేంద్రానికి తెలియజెప్పాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఈనెల 26వ తేదీన వైజాగ్ ఆర్కే బీచ్‌లో యువత చేపట్టే నిరసన కార్యక్రమానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. 
 
‘‘ఆంధ్రప్రదేశ్‌ యువత జనవరి 26న వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం నిశ్శబ్ద నిరసనకు ప్రణాళికలు రచిస్తే.. జనసేన వారికి పూర్తిగా మద్దతిస్తుంది’’ అని ట్వీట్ చేశారు. అవకాశవాద, నేరపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓ ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్‌ను జనసేన విడుదల చేయనుందన్నారు. 'దేశ్ బచావో' పేరిట ఈ ఆల్బమ్ ఉంటుందని, దీన్ని జనవరి 24న విడుదల చేస్తామని తెలిపారు. వాస్తవానికి ఈ ఆల్బమ్‌ను ఫిబ్రవరి 5న విడుదల చేయాలని భావించినప్పటికీ, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించామని పవన్ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments