Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి పోర్న్ వీడియోలు కాదు... వెబ్ సిరీస్‌ : రాజ్‌కుంద్రా అడ్వకేట్

Webdunia
గురువారం, 22 జులై 2021 (15:16 IST)
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అడ్వకేట్ మాట్లాడుతూ, రాజ్‌కుంద్రా తీసింది పోర్న్ వీడియో కాదనీ వెబ్ సిరీస్ అని వెల్లడించారు. 
 
అశ్లీల చిత్రాలను నిర్మించి, వాటిని వివిధ యాప్‌ల ద్వారా విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 
 
ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఆయన కేసుకు సంబంధించి కోర్టులో జరిగిన విచారణలో ఆయన తరపు లాయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
 
రాజ్‌కుంద్రా అరెస్టుకు కారణమైన వీడియో షూట్ ఒక వెబ్ సిరీస్‌కి సంబంధించినదని సదరు న్యాయవాది అన్నారు. ఆ షూట్ ఓ వెబ్ సిరీస్ మాత్రమే తప్ప పోర్న్ ఫిలిం కాదని చెప్పారు. 
 
ఇద్దరు వ్యక్తులు కెమెరా ముందు శృంగారం చేస్తున్నట్టు ఉంటేనే పోర్న్ కిందకు వస్తుందని... అశ్లీల సన్నివేశాలు ఉన్నంత మాత్రాన పోర్న్ కిందకు రాదని అన్నారు.
 
ఇదిలావుంటే, కుంద్రా ఆదేశాల మేర‌కు చిన్న సంస్థ‌లు 70 పోర్న్ వీడియోల‌ను రూపొందించిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపైనే పోలీసులు కూపీ లాగుతున్నారు. చిన్న త‌ర‌హా నిర్మాణ సంస్థ‌లు ఆ పోర్న్ వీడియోల‌ను షూట్ చేసిన‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ల‌న్నీ ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ నిఘాలో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.
 
ఇత‌ర‌ నిర్మాణ సంస్థ‌ల‌తో పాటు కుంద్రా ఓన‌ర్‌గా ఉన్న హాట్‌షాట్స్ యాప్ కోసం ప్ర‌త్యేకంగా 90 పోర్న్ వీడియోల‌ను రూపొందించారు. వీటిల్లో కొన్ని వీడియోలు 20 నుంచి 30 నిమిషాలు పైగా ఉంటాయ‌ని పోలీసులు వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.
 
పోర్న్ రాకెట్‌ను న‌డిపిస్తున్న కేసులో ఇప్ప‌టికే 11 మందిని అరెస్టు చేశారు. రాజ్‌కుంద్రాపై 420 చీటింగ్‌, 34 కామ‌న్ ఇంటెన్ష‌న్‌, 292, 293 సెక్ష‌న్ల కింద కేసులు బుక్ చేశారు. మరోవైపు, తనకు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టుకు ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం