Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోర్న్‌ VS వ్యభిచారం.. డబ్బిచ్చి కెమెరా ముందు శృంగారం చేస్తే తప్పేంటి?

Advertiesment
పోర్న్‌ VS వ్యభిచారం.. డబ్బిచ్చి కెమెరా ముందు శృంగారం చేస్తే తప్పేంటి?
, మంగళవారం, 20 జులై 2021 (17:22 IST)
Raj Kundra
పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త, ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈయన రిమాండ్‌కు కూడా తరలించారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో రాజ్‌ కుంద్రా ఇదే విషయంపై చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 
 
దాదాపు పదేళ్ళ కింద ఈ పోస్ట్ చేసాడు రాజ్ కుంద్రా. ఇప్పుడు అరెస్ట్ అయిన విషయాన్నే అప్పుడు అధికారికంగా అడిగాడు రాజ్ కుంద్రా. మార్చి 29, 2012న రాజ్‌ కుంద్రా తన ట్విటర్‌లో పోర్న్‌ వర్సెస్ వ్యభిచారం అనే పోస్ట్ పెట్టాడు. అందులో వ్యభిచారానికి, పోర్న్‌కు లింక్ పెడుతూ ఈయన వివాదాస్పద ట్వీట్ చేసాడు.
 
కొంతమందికి డబ్బులిచ్చి కెమెరా ముందు శృంగారం చేయడాన్ని ఎందుకు చట్టబద్ధం చేయకూడదు అంటూ ప్రశ్నించాడు ఈయన. వ్యభిచారానికి దీనికీ ఏమైనా వ్యత్యాసం ఉందా అంటూ ప్రశ్నించాడు. ఈ ట్వీట్ అప్పట్లో చాలా సంచలనం అయింది. 
 
కాంట్రవర్సీ కావడమే కాకుండా రాజ్ కుంద్రాపై మహిళా సంఘాలు కూడా మండిపడ్డాయి. అయితే ఇప్పుడున్నంత సోషల్ మీడియాలో 2012లో లేకపోవడంతో రాజ్ కుంద్రా అప్పుడు బతికిపోయాడు. కానీ పదేళ్ల కింద ట్వీట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది. రాజ్‌ కుంద్రాపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 
 
మరోవైపు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని.. ఈ కేసులో ప్రధాన కుట్ర దారుడుగా రాజ్‌ కుంద్రా కనిపిస్తున్నాడని ముంబయి పోలీస్‌ కమిషనర్‌ మీడియాతో తెలిపారు. ఇందులో మరిన్ని కీలకమైన విషయాలు తెలియాలంటే జులై 23 వరకు రాజ్ కుంద్రా తమ కస్టడీలోనే ఉంచనున్నట్లు తెలిపారు. అయితే రాజ్ కుంద్రా మాత్రం తనేం తప్పు చేయలేదని.. తనపై అన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడుద‌ల‌కి సిద్ధ‌మైన‌ తేజ స‌జ్జా, ప్రియా వారియ‌ర్‌ `ఇష్క్`