Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెద్దలకు మాత్రమే' : ప్రైవసీని కోరుకునే వారికి ప్రత్యేక హోటల్... 85 శాతం హౌస్‌ఫుల్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (15:20 IST)
కొన్ని సినిమాలు 'పెద్దలకు మాత్రమే' అని టైటిల్ కింద రాసివుంటుంది. ఇలాంటి మూవీలకు ఏ సర్టిఫికేట్ ఇస్తుంటారు. థియేటర్లలోకి కూడా కేవలం పెద్దలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం తెల్సిందే. హోటళ్లలో కూడా 'పెద్దలకు మాత్రమే' అనే హోటల్ ఒకటుందని మీలో ఎవరికైనా తెలుసా? ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ, అక్కడో అలాంటి హోటల్ ఉంది. హోటల్‌ నేమ్ బోర్డు కిందనే పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్ వేలాడుతూ వుంటుంది. కేవలం ప్రైవసీని కోరుకునే పెద్దలకు మాత్రమే ఈ హోటల్. ఈ హోటల్ ఏకంగా 85 శాతం ఆక్యుపెన్షీతో నడుస్తోందంటే ఆశ్చర్యపడాల్సిందే. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గోవా రాజధాని పనాజీలోని  విమానాశ్రయం నుంచి గంట సేపు ప్రయాణిస్తే బీచ్‌కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో 10 నిమిషాలు దూరంలో ఈ హోటల్ ఉంది. ఇందులో 28 పడక గదులు ఉన్నాయి. ప్రత్యేక భోజనాలు, స్పా చికిత్సలు, శృంగార బహుమతులు ఇలా ఒకటేంటి అన్ని రకాల షాపింగ్స్ ఇక్కడే చేసుకునేలా షాపులు ఉన్నాయి. 
 
వీటితోపాటు.. ఈ హోటల్‌లో బస చేసేందుకు వచ్చే అతిథులకు ఉచిత వైఫై ,కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఇపుడు చాలా హోటళ్ళలో వైఫై, కాంప్లిమెంటరీ టిఫన్ అనేవి కామన్ అయిపోయాయి. అలాగే, ఈ హోటల్ 'పెద్దలకు మాత్రమే' అనేది కూడా అంతే కామన్‌గా మారిందంట. 
 
అందుకే ఏకాంతం కోరుకునే వారి కోసం ప్రత్యేక హోటల్‌ను సిద్ధం చేయాలన్న ఆలోచన నుంచి ఆ హోటల్ పుట్టిందంట. విదేశాల్లో ఈ కాన్సెప్ట్ చాలా వేగంగా వృద్ధి చెందుతున్నది. ఈ హోటల్ ఏకంగా 85 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నదంటే.. ఎంత మంది ప్రైవసీ కోరుకుంటున్నారో అర్థమవుతుంది. ఇంతకీ ఈ హోటల్ పేరు చెప్పలేదు కదా.. ది పార్క్ బగా రివర్ గోవా. రివర్ గోవా లేన్, మకీస్ శాటర్‌డే మార్కెట్ ఎదురుగా, బగా, గోవా 403 516 అనే చిరునామాలో వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments