Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా సోకిన కేంద్ర మంత్రి ఆరోగ్యం విషమం... గోవాకు ఎయిమ్స్ వైద్య బృందం

Advertiesment
AYUSH Minister Shripad Naik
, సోమవారం, 24 ఆగస్టు 2020 (19:51 IST)
కరోనా వైరస్ బారినపడిన కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయన ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఈయన ఆయుష్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
ఈయనకు కరోనా వైరస్ సోకిన తర్వాత గోవాలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనకు ఉన్నట్టుండి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో ఆయనకు చికిత్స అందించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ నిపుణుల బృందం గోవా బయల్దేరింది. మణిపాల్ వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్ వర్గాలు నిపుణులను పంపాయి. 
 
ఇదే అంశంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందిస్తూ, కేంద్ర మంత్రి నాయక్‌కు ఉన్నట్టుండి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయనీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్య బృందం గోవాకు వస్తుందన్నారు. ఈ వైద్య బృందం పరిశీలించిన తర్వాత నాయక్‌ను ఢిల్లీ ఆస్పత్రికి తరలించాలా లేదా అనేది నిర్ధారిస్తారని తెలిపారు. 
 
అంతేకాకుండా, గోవాలో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

360 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్