ఆన్ లైన్ క్లాసులకు విదేశాల నుండి తమ దేశానికి వస్తున్న విద్యార్థులను తమ స్వదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశిస్తూ గత నెలలో ఆర్డర్లను జారీ చేసింది ట్రంప్ ప్రభుత్వం. అయితే ఈ ఆర్డర్లను రద్దు చేసారు.
కళాశాలలు వివిధ సంస్థల నుండి వస్తున్న ఒత్తిడి మేరకు విదేశీ విద్యార్థులను తమ దేశాలకు తిరిగి పంపించాలన్న ట్రంప్ కోరిక ఆ ప్రభుత్వం మంగళవారం విరమించుకుంది.
కరోనా వైరస్ కారణంగా ఆన్ లైన్ తరగతులు బోధిస్తున్న తమ కళాశాలల్లో విదేశీ విద్యార్థులు తమ దేశాలకు వెళ్లాలని యుఎస్ అధికారులు గత వారం ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా పలు కళాశాలల నుండి ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంది.