Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో ఐటీ రిటర్న్స్‌ (ఐటీఆర్)కు ఆఖరు తేదీ..

Webdunia
సోమవారం, 31 జులై 2023 (07:43 IST)
దేశంలో ఆదాయపన్ను రిటర్న్స్‌లు (ఐటీఆర్) దాఖలు చేసేవారి చివరి తేదీ జూలై 31వ తేదీ సోమవారంతో ముగియనుంది. దీంతో అనేక మంది ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు పోటీపడుతున్నారు. గత 2022లో మొత్తం 7.4 కోట్ల మంది ఐటీ రిటర్న్స్‌లు దాఖలు చేయగా ఈ యేడాది ఇప్పటివరకు 5.83 కోట్ల మంది ఐటీఆర్‌లు దాఖలు చేశారు. ఐటీ రిటర్నుల దాఖలుకు నేడు తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో ఐటీఆర్‌లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
ఆదివారం ఒక్కరోజే భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. చివరి ఒక గంట వ్యవధిలో ఏకంగా 3.04 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఐటీ పోర్టల్‌లోకి 1.78 కోట్ల మంది లాగిన్ కాగా, సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెప్పారు. సెలవు రోజైన ఆదివారం మధ్యాహ్నం వరకు 10.39 లక్షల ఐటీఆర్‌లు దాఖలు కావడం గమనార్హం. 
 
కాగా, ఇప్పటివరకు దాఖలు చేసినవారే కాదు.. ఇంకా దాఖలు చేయాల్సినవారు 2 కోట్లమందికి పైగా ఉన్నారు. వీరంతా ఆఖరు రోజైన సోమవారం దాఖలు చేసేందుకు పోటీపడే అవకాశం. జూలై 31వ తేదీ తర్వాత అపరాధ రుసుంతో ఐటీఆర్ దాఖలు అనుమతిస్తామని ఆదాయన్నుశాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments