సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి మరో కేంద్ర మంత్రి రవిశంకర్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (18:45 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన గుర్గావ్‌లో ఉన్న మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయనతో భేటీ అయిన వారంతా ఇపుడు సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియా సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లగా, ఇపుడు మరో కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. 
 
తనను కలిసిన అందరూ ఐసొలేషన్‌లోకి వెళ్లాలని, కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని అమిత్ షా సూచించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయనను కలిసిన పలువురు ఇప్పటికే ఐసొలేషన్‌లోకి వెళ్లిపోయారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది.
 
మరోవైపు, దేశంలో కొవిడ్‌-19 కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. కరోనా కేసుల సంఖ్య 18 లక్షల మార్కును దాటింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 52,972 మందికి కొత్తగా కరోనా సోకింది. అదేసమయంలో 771 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 18,03,695కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 38,135కి పెరిగింది. 5,79,357 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 11,86,203 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,02,02,858 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,81,027 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments