Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత నిఘా వ్యవస్థలో సరికొత్త అస్త్రం

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:44 IST)
భారత్‌ నిఘా విభాగంలోకి మరో కొత్త అస్త్రం వచ్చి చేరింది. అదే ‘ఇమిశాట్‌’, దీన్ని ముద్దుగా ‘రాడార్‌ కిల్లర్‌’ అని కూడా పిలుస్తారు. ఈరోజు ప్రయోగించిన ఉపగ్రహాల్లో భారతదేశం ప్రవేశపెట్టిన ఇమిశాట్‌ను హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. దీనిని ప్రాజెక్ట్ కౌటిల్య కింద అభివృద్ధి చేశారు. ఇందులో అత్యంత పదునైన ఎలక్ట్రానిక్‌ నిఘా వ్యవస్థ ఉంది. ఇది శత్రుదేశాల రాడార్లపై నిఘా పెడుతుంది.
 
ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.432 కోట్లు వెచ్చించారు. 749 కిలోమీటర్ల పైన సన్‌సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి చేర్చిన ఈ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఇది రాడార్‌ నెట్‌వర్క్‌పై నిఘా ఉంచుతుంది. శత్రుదేశాలు ఎక్కడెక్కడ రాడార్లను అమర్చారో గుర్తించి సమాచారం అందజేస్తుంది. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం, చిత్రాలను అందజేస్తుంది. గతంలో డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించి శత్రుదేశాల భౌగోళిక సమాచారాన్ని తెలుసుకునే వారు కానీ ఇమిశాట్‌ రాకతో 24 గంటలూ నిఘావేసే అవకాశం దక్కుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments