Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గగన్‌యాన్ మిషన్' కోసం తొలి పరీక్షకు ఇస్రో సిద్ధం

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (12:28 IST)
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధిచిన తొలి పరీక్ష చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమైంది. శ్రీహరికోటలోని స్పేస్ సెంటరులో అక్టోబరు 21వ తేదీన ఉదయం 8 గంటలకు టెస్ట్ వెహికిల్ డెవలప్మెంట్ పరీక్ష నిర్వహించనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించదలిచిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి వస్తుంది. 
 
వ్యోమగాముల అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో గగన్‌యాన్ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యోమగాములు ప్రయాణించే క్రూమాడ్యుల్, రాకెట్‌పై తొలి పరీక్షను ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో టీవీ-డీ1 అనే ప్రయోగాత్మక రాకెట్‌ను సిద్ధం చేసింది. దీని సాయంతో క్రూ మాడ్యుల్‌ను అంతరిక్షంలోకి పంపిస్తుంది. 
 
రాకెట్ కొంత ఎత్తుకు చేరుకున్నాక ఎస్కేప్ సిస్టమ్ క్రియాశీలకమై క్రూ మాడ్యుల్‌ను రాకెట్ నుంచి వేరు చేస్తుంది. ఈ క్రమంలో క్రూ మాడ్యుల్ తిరిగి బంగాళాఖాతంలో పడుతుంది. నావికాదళం సాయంతో ఇస్రో క్రూ మాడ్యుల్‌ను స్వాధీనంలోకి తీసుకుని అందులోని డేటా ఆధారంగా రాకెట్, ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యుల్ పనితీరును విశ్లేషిస్తుంది. అత్యవసర సందర్భాల్లో వినియోగించే ఎస్కేప్ సిస్టమ్ పనితీరును ఇస్రో ఈ ప్రయోగం ద్వారా పరీక్షిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments