ఇకపై ట్విట్టర్‌‌లో లైక్ లేదా రీట్వీట్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే...

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (11:36 IST)
ప్రముఖ సోషల్ మీడియాలో వేదిక అయిన ట్విట్టర్ (ఎక్స్) మరో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇకపై ఇతరుల చేసే ట్వీట్లకు రీ ట్వీట్ చేయాలన్నా, రిప్లై ఇవ్వాలన్నా డబ్బులు చెల్లించాల్సిందేనని అంటుంది. యేడాదికి ఒక డాలర్ చెల్లించి, సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికే ఈ సదుపాయం కల్పించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విదానాన్ని వెబ్ వెర్షన్‌లో తొలుత పరీక్షిస్తున్నామని, త్వరలోనే దీనిని అమల్లోకి తీసుకొస్తామని చెప్పింది. ఈ కొత్త సబ్ స్క్రిప్షన్ మోడల్ ముఖ్యోద్దేశం స్పామర్లను, రోబోలను అడ్డుకోవడానికేనని తేల్చి చెప్పింది. వార్షిక ఫీజు విషయానికి వస్తే అమెరికన్లను యేటా ఒకడాలర్, మిగిలిన దేశాలలో ఎక్చేంజ్ రేటును బట్టి ధరలు మారుతాయని వివరించింది. 
 
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పలు మార్పులు చేసిన విషయం తెల్సిందే. ఉద్యోగులను తొలగించడం మొదలుకుని బ్లూటిక్‌కు ఫీజు వసూలు చేయడం దాకా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై విమర్శలు ఎదురవుతుండటంతో పలు నిర్ణయాలను వెనక్కితీసుకున్నారు. తాజాగా ట్విట్లకు లైక్ కొట్టాలనా, రీట్వీట్ చేయాలన్నా ఫీజు చెల్లించాల్సిందేనని  స్పష్టం చేయడంతో నెటిజన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments