Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాద్భుతానికి శ్రీకారం చుట్టనున్న ఇస్రో.. ఒకేసారి 83 ఉపగ్రహాల ప్రయోగానికి సిద్ధం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. జనవరిలో ఒకేసారి 83 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఉపగ్రహాల ప్రయోగానికి తేదీ ఇంకా ఖరారు కానప్

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (10:12 IST)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. జనవరిలో ఒకేసారి 83 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఉపగ్రహాల ప్రయోగానికి తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ జనవరి నెల చివరి వారంలో ఉండవచ్చని భావిస్తున్నారు. 
 
ఇదే అంశంపై ఇస్రో ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. 83 ఉపగ్రహాల్లో 80 ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా తదితర దేశాలకు చెందినవి. వీటి బరువు 500 కేజీలు. మూడు మాత్రం మన దేశ ఉపగ్రహాలు. ఇవి కార్టోశాట్‌ 2 సిరీస్ 730 కేజీలు, ఐఎన్‌ఎస్ ఐఏ, ఐఎన్ఎస్ 1బి రెండింటి బరువు కలిపి 30 కేజీలు. 
 
ఈ యేడాది జూన్‌లో ఇస్రో రికార్డు స‌ృష్టిస్తూ శ్రీహరికోట నుంచి ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. అంతకుముందు 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించింది. వచ్చే ఏడాది ఐదు సమాచార ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యమని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments