Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్‌ఎల్‌వీ -సీ51 కౌంట్‌డౌన్ ప్రారంభం..

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:54 IST)
సరికొత్త అధ్యాయానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది. ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో తొలి అంతరిక్ష ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ51 ప్రయోగంతో వాణిజ్యరంగంలో తొలి అడుగు వేయనుంది. 
 
ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో (షార్‌)లో రాకెట్‌ కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ఉదయం 8.54 గంటలకు ప్రారంభించారు. సుమారు 25.30 గంటల పాటు ప్రక్రియ కొనసాగనుంది. ఆదివారం ఉదయం 10.24గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.
 
అమెజానియా-1తో పాటు మరో 18 ప్రైవేటు ఉపగ్రహాలను రాకెట్‌ మోసుకెళ్లనుంది. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ నేతృత్వంలో నింగిలోకి తొలి వాణిజ్య ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌ కక్షలో ప్రవేశపెట్టనుంది. 
 
బ్రెజీలియన్‌ శాటిలైట్‌ అమెజానియా-1 భూపర్యవేక్షణకు కీలకమైంది. అమెరికాకు చెందిన స్పేస్‌ బీస్‌ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్‌-1 నానో కాంటాక్ట్‌-2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్‌ పేరుతో మూడు యూనివర్సిటీల విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీశ్‌ ధావన్‌ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments