Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (12:11 IST)
ప్రస్తుత లోక్‌సభలో ఉన్న ఎంపీల్లో దేశంలోనే అత్యంత పిన్నవయస్కులైన ఎంపీగా కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య రికార్డులకెక్కారు. ఈయన త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈయన చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. వీరి వివాహం మార్చి నెల 24వ తేదీన బెంగుళూరులో అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. 
 
వధువు వివరాలను పరిశీలిస్తే, మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ చేసిన శివశ్రీ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్ డిగ్రీని అందుకున్నారు. పొన్నియన్ సెల్వన్-పార్ట్ 2 సినిమా కన్నడ వెర్షన్‌లో శివశ్రీ ఓ పాట పాడారు. ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్‌కు 2 లక్షల మందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 
 
తేజస్వి సూర్య వృత్తి పరంగా న్యాయవాది. ప్రస్తుతం బెంగళూరు సౌత్ నుంచి రెండోసారి ఎంపీగా కొనసాగుతున్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన సూర్య కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌పై 3.31 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. సెప్టెంబరు 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాగా, 34 ఏళ్ల సూర్య 'ఐరన్ మ్యాన్ 70.3 ఎండ్యురన్స్ రేస్' పూర్తి చేసిన తొలి సిట్టింగ్ ఎంపీగా గతేడాది రికార్డు సృష్టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments