ఆ నీళ్ళు రాజస్థాన్‌కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (11:53 IST)
పాకిస్థాన్ వెళ్లాల్సిన నీళ్లను రాజస్థాన్‌కు మళ్లించి, పాకిస్థాన్ గొంతు ఎండాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదన్నారు. ఈ ఒప్పందం నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిన ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా నీళ్లు అందుకుందని, ఇకపై నీటి కొరతతో అల్లాడిపోవాల్సిందేనని దుయ్యబట్టారు.
 
ఆయన తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం. కానీ, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారత్‌కు ఉంది. అదే చేశాం. ఈ ఒప్పందం పీఠికలో రెండు దేశాల శాంతి, పురోగతి సాధించాలనే విషయాన్ని పొందుపరిచారు. కానీ, ఒకసారి దీన్ని ఉల్లంఘిస్తే రక్షించడానికి ఇంకేమీ ఉండదు అని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. 
 
భారత్‌కు హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగిస్తాం. కెనాల్‌ను నిర్మించి పాకిస్థాన్‌కు వెళ్ళే నీటిని రాజస్థాన్‌కు మళ్లిస్తాం. ఇన్నాళ్లూ పాక్ అన్యాయంగా నీటిని అందుకుంది. ఇకపై ఆ దేశం గొంతు ఎండాల్సిందే అని అన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments