Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా

Advertiesment
amit shah

ఠాగూర్

, బుధవారం, 7 మే 2025 (14:20 IST)
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బుధవారం తెల్లవారుజామున సైనక చర్యకు శ్రీకారం చుట్టింది. పాకిస్థాన్, పాక్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులకు పాల్పడింది. ఈ దాడులపై కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా స్పందించారు. 'పహల్గాం మన అమాయక సోదరుల దారుణ హత్యకు ఇది భారత్ ఇచ్చిన సమాధానం' అని వ్యాఖ్యానించారు. అలాగే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా స్పందించారు. 
 
ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళ అధిపతులతో ఆయన మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం 'భారత్ మాతా కీ జై’ అంటూ ట్వీట్ చేశారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ 'ఉగ్రవాదంపై ప్రపంచం జీరో టాలరెన్స్ చూపాలి' అని పిలుపునిచ్చారు. 
 
పహల్గాం దాడి బాధితుల కుటుంబ సభ్యులు భారత సైన్యం చర్య పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం జరిగిందని భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, శశి థరూర్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే వంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఈ దాడులను స్వాగతించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం భారత సైన్యాన్ని అభినందిస్తూ 'జై హింద్ కీ సేనా' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
 
ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం 
పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ దాడులకు దిగింది. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఈ దాడులు చేపట్టింది. భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో 80 నుంచి వంది మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ప్రధానంగా బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది.
 
ఈ రెండు చోట్లా ఒక్కో క్యాంపులో 25-30 మంది మృతులు ఉన్నట్లు తెలుస్తోంది.  వీటిల్లో మర్కజ్ తొయిబా మదర్సా అత్యంత కీలకమైంది. దీనిని లష్కరే తొయిబా ప్రధాన కార్యాలయంగా వినియోగిస్తుంటారు. ఇక బవహల్‌పూరులోని ఉస్మాన్ ఓ అలి క్యాంప్ జైషే ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉంది.
 
వాస్తవానికి దీనిని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకుంది.. కానీ, నాడు చివర్లో వదిలేసింది. ఈసారి మాత్రం దానిని నేలమట్టం చేసింది. ఇప్పటివరకు తొమ్మిది స్థావరాల్లో 80 మంది వరకు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పాక్కు జరిగిన నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Operation Sindoor: కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు- పవన్ కల్యాణ్ (video)