Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుడిని కిందపడేసి ఇండిగో సిబ్బంది ఎలా కొడుతున్నాడో చూడండి (వీడియో)

దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన గ్రౌండ్ సిబ్బంది దురుసు ప్రవర్తనతో విమాన ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవలే ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి పి.వి

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (12:48 IST)
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన గ్రౌండ్ సిబ్బంది దురుసు ప్రవర్తనతో విమాన ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవలే ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి పి.వి. సింధు పట్ల ముంబై ఎయిర్‌పోర్టులో ఇండిగో గ్రౌండ్ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. తాజాగా మరో ప్రయాణీకుడిని ఇండిగో సిబ్బంది ఒకరు ప్రయాణీకుడిని చావబాదాడు. ఈ దారుణం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జరిగింది. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చెన్నైకి చెందిన రాజీవ్ కతియాల్ అనే వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఇండిగో బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. బస్సు ఆలస్యంగా రావడంతో రాజీవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బస్సు ఎక్కడకుండా రాజీవ్‌ను సిబ్బంది అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సిబ్బంది ఒకరు రాజీవ్‌ను కిందపడేసి చావబాదాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్లు రికార్డు చేశాడు. దీనిపై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై వేటు వేసింది. అలాగే, సదరు ప్రయాణికుడికి విమానయాన సంస్థ క్షమాపణలు కూడా చెప్పింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments