Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 169 మంది ప్రయాణికులు సేఫ్

ఠాగూర్
బుధవారం, 9 జులై 2025 (16:04 IST)
ఇండిగో విమానానికి పెను ముప్పుతప్పింది. దీంతో ఆ విమానంలో ఉన్న 169 మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తప్పింది. ఈ విమానం పాట్నా నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. పక్షి బలంగా ఢీకొట్టడంతో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి పాట్నాలోనే సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానానికి మరమ్మతులు చేసిన తర్వాత ఢిల్లీకి బయలుదేరింది.
 
కాగా, ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం. ఇటీవలే పాట్నా నుంచి రాంచీ వెళుతున్న మరో ఇండిగో విమానాన్ని గాల్లో ఓ గద్ద ఢీకొట్టింది. ఆ సమయంలో విమానం దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఘటనలో 175 మంది ప్రయాణికులు ఉండగా, పైలెట్ చాకచర్యగా రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. 
 
అలాగే, జూన్ 23వ తేదీన తిరువనంతపురానికి వచ్చిన ఎయిరిండియా విమానం ల్యాండ్ అవుతున్నపుడు పక్షి ఢీకొట్టి ఉంటుందని అనుమానించారు. ఈ కారణంగా తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన రిటర్న్ ఫ్లైట్‌ను ఎయిరిండియా రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sirisha: సుడిగాలి సుధీర్ పెళ్లిచేసుకోడు : ధనరాజ్ భార్య శిరీష స్టేట్ మెంట్

Manoj: విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ : మంచు మనోజ్‌

RK Sagar: ఆయన చనిపోయినప్పుడు చాలా పీలయ్యా : ఆర్.కె. సాగర్

పోలీస్ స్టేషన్ పార్ట్ టైమ్ పాఠశాల అనే కాన్సెప్ట్ తో 14 దేశాల్లో సూత్రవాక్యం సిద్ధం

తెలంగాణ నేపథ్యంగా సాగే రాజు గాని సవాల్ టీజర్ ఆవిష్కరించిన జగపతిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments