Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్‌ స్ట్రైక్స్‌తో విరుచుకుపడిన ఇండియన్ ఆర్మీ...

ఇండియన్ ఆర్మీ మరోమారు సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. ఈ దఫా మాత్రం పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల శిబిరాలపై కాదు. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇండో- మయన్మార్‌ సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసింది.

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (16:24 IST)
ఇండియన్ ఆర్మీ మరోమారు సర్జికల్ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. ఈ దఫా మాత్రం పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల శిబిరాలపై కాదు. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇండో- మయన్మార్‌ సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసింది. ఇండియన్‌ ఆర్మీకి చెందిన 70 మంది పారా కమాండోల బృందం బుధవారం ఉదయం 4.45 గంటలకు ఈ దాడి నిర్వహించింది. 
 
ఈ దాడిలో లాంఖూ గ్రామ సమీపంలో ఉన్న నాగా తీవ్రవాదుల శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ మెరుపుదాడుల్లో ఎన్‌ఎస్‌సీఎన్‌-కే ఉగ్రమూకకు భారీ నష్టం వాటిల్లినట్టు సైన్యం ప్రకటించింది. పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పింది. అయితే, సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపిన కమాండోలు అంతర్జాతీయ సరిహద్దు దాటలేదని స్పష్టంచేసింది. 
 
ఎస్‌ఎస్‌ ఖప్లాంగ్‌ నేతృత్వంలో ఏర్పడిన ఎన్‌ఎస్‌సీఎన్‌-కే తిరుగుబాటుదళం.. నాగాల్యాండ్‌, మణిపూర్‌ల్లో మన జవాన్లపై వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఈ తరహా మెరుపుదాడులు నిర్వహించి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో తాజాగా ఇండో మయన్మార్‌ సరిహద్దుల్లో భారత ఆర్మీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments