Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరమైతే మళ్లీ మెరుపుదాడులు : స్పష్టం చేసిన భారత ఆర్మీ

తీవ్రవాదుల ఏరివేత కోసం అవసరమైతే మళ్లీ మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) చేస్తామని భారత్ ఆర్మీ ప్రకటించింది. సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలు బయటపెట్టాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆర్మీ తొలిసా

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (10:51 IST)
తీవ్రవాదుల ఏరివేత కోసం అవసరమైతే మళ్లీ మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) చేస్తామని భారత్ ఆర్మీ ప్రకటించింది. సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలు బయటపెట్టాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆర్మీ తొలిసారిగా పార్లమెంటరీ స్థాయీ సంఘంలోని ఎంపీలకు మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. 
 
ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ స్వయంగా కమాండో ఆపరేషన్ వివరాలు తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్న పక్కా సమాచారంతో సైన్యం దాడులకు దిగినట్టు వివరించారు. అవసరమైతే మరోసారి కూడా సర్జికల్ స్ట్రయిక్స్‌కు దిగుతామని భారత డీజీఎంవో పాకిస్థాన్ డీజీఎంవోకు స్పష్టంచేసినట్టు రావత్ తెలిపారు. 
 
ఆపరేషన్ జరిగిన తీరు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలకు జరిగిన నష్టం తదితర వివరాలను క్షుణ్ణంగా తెలిపారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న విషయాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆయన చెప్పిన విషయాలతో పార్లమెంటరీ స్థాయీ సంఘంలోని చాలామంది సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సంఘం ఛైర్మన్ బీసీ ఖండూరీ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments