Webdunia - Bharat's app for daily news and videos

Install App

గస్తీ ఒప్పందం వేళ .. భేటీ కానున్న భారత్‌-చైనా రక్షణ మంత్రులు

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (16:51 IST)
భారత్ చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సరిహద్దుల్లో గస్తీపై ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇదే అంశంపై ఇరు దేశాలు లోగడ ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ త్వరలో సమావేశంకానున్నారు. 
 
సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా వారి మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఆసియాన్ రక్షణమంత్రుల సమావేశాలకు అనుబంధంగా వచ్చేవారం వీరి భేటీ జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రధానంగా వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి నాలుగేళ్లుగా కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరుదేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
 
ఈ ఒప్పందం మేరకు 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగుతుందని, ఇరుదేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చని రెండు దేశాలు ఒప్పందంలో పేర్కొన్నాయి. దానిలోభాగంగా కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త సీసాలో పాత కథ వరుణ్ తేజ్ మట్కా మూవీ రివ్యూ

నటి శ్రీరెడ్డిపై వరుస కేసులు : నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు...

సూర్య నటించిన కంగువ ఎలా వుందో తెలుసా? రివ్యూ రిపోర్ట్

‘వికటకవి’ పీరియాడిక్ సిరీస్‌.. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం: డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలి

కార్తీ లుక్ దేనికి హింట్.. కంగువకు సీక్వెల్ వుంటుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments