Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం సక్సెస్... 500-1000 కిలోల వరకు వార్‌హెడ్‌ను?

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (14:42 IST)
Prithvi-2
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణి పరీక్ష సక్సెస్ అయింది. మిస్సైల్‌ పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. 
 
ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం (జూన్15,2022) రాత్రి 7.40 గంటలకు మిస్సైల్‌ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రైనింగ్‌ లాంచ్‌లో మిస్సైల్‌ కచ్చిత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
9 మీటర్ల పొడవు, సింగిల్-స్టేజ్ ద్రవ ఇంధనంతో పనిచేసే పృథ్వీ-2 మిస్సైల్‌ తొలిసారిగా 1996లో ప్రయోగించారు. 2003లో భారత సాయుధ దళాలలోకి ప్రవేశించింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన మొదటి క్షిపణి ఇదే.
 
తాజాగా ప్రయోగించబడిన పృథ్వీ-2 క్షిపణికి 350 కిలోమీటర్ల వరకు.. 500-1000 కిలోల వరకు వార్‌హెడ్‌ను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగివుంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్‌.. 350 కిలోమీటర్ల పరిధిలోకి రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ద్రవ ఇంజిన్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments