రసమలై వంటకానికి విశిష్ట గుర్తింపు... ప్రపంచంలోనే రెండో ర్యాంకు

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (08:26 IST)
భారతీయ స్వీట్ వంటకాల్లో ఒకటైన రసమలై వంటకానికి విశిష్ట గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే రెండో వంటకంగా గుర్తింపు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్-10 డిజర్ట్స్ జాబితాను టేస్ట్ అట్లాస్ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో రసమలైకు విశిష్ట గుర్తింపు లభించింది. పోలెండ్‌కు చెందిన సెర్నిక్ స్వీట్‌కు ప్రథమ స్థానం లభించింది. భోజనం సందర్భంగా ఆరగించే స్వీట్లలో రసమలై ఒకటి. 
 
రసమలై ఓ బెంగాలీ వంటకం. బెంగాల్‌లో ఓ మూలకు వెళ్లినా రసమలై స్వీట్‌ నోరూరిస్తూ స్వాగతం పలుకుతుంది. దీని తయారీలో ప్రధానంగా పాలు ఉపయోగిస్తారు. చక్కెర, కుంకుమ పువ్వు, నిమ్మరసం రసమలై తయారీలో ఉపయోగిస్తారు. ఈ సంస్థ తయారు చేసిన జాబితాలో పోలెండ్‌‍కు చెందిన సెర్నిక్ వంటకం ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. సెర్నిక్ వంటకాన్ని కోడిగుడ్లు, చక్కెరతో తయారు చేస్తారు. సెర్నిక్ కూడా ఒక రకమైన చీజ్ వంటి డిజర్ట్ వంటకమే. 
 
అలాగే, టేస్ట్ అట్లాస్ తయారు చేసిన టాప్ 10 డిజర్ట్‌ల జాబితాలో సెర్నిక్, రసమలైల తర్వాత గ్రీస్‌కు చెందిన స్ఫకియానోపిటా, అమెరికాకు చెందిన న్యూయార్క్ చీజ్, జపాన్‌కు చెందిన జపనీస్ చీజ్, స్పెయిన్‌కు చెందిన బాస్క్ చీజ్, హంగేరికి చెందిన రాకోజీ టురోస్, గ్రీస్‌కు చెందిన మెలోపిటా, జర్మనీకి చెందిన కుసెకుచెన్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన మిసారెజీ స్వీట్లు వరుస స్థానాల్లో నిలిచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments