ప్రపంచలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టులు ఏవి?

ఠాగూర్
శుక్రవారం, 12 జనవరి 2024 (10:57 IST)
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాను హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ వెల్లడించింది. 2024కు సంబంధించిన ఈసూచీలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఈ దేశాలు పాస్‌పోర్టు ఉంటే వీస్ లేకుండానే 194 దేశాలకు ప్రయాణించవచ్చని ఇండెక్స్ పేర్కొంది. 
 
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ఆయా దేశాల ర్యాంకులను నిర్ణయించరు. శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో గత ఐదేళ్లుగా జపాన్, సింగపూర్ దేశాలు మొదటి స్థానంలో ఉన్నాయి. అయితే, ఈ త్రైమాసికంల యూరోపియన్ దేశాల ర్యాంకులు కొంతమేరకు మెరుగయ్యాయి. 
 
ఇతపోతే 193 దేశాలకు వీసా రహిత ప్రయాణ అనుమతి ఉన్న ఫిన్లాండ్, స్వీడన్, దక్షిణ కొరియా పాస్‌పోర్టులు రెండో స్థానలో నిలిచాయి. ఇక ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు మూడో ర్యాంకులో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టుతో 192 దేశాల్లో వీసా రహిత ప్రయాణం చేయొచ్చు. అయితే, శక్తిమంతమైన పాస్ పోర్టు జాబితాలో భారత పాస్‌పోర్టుకు 80వ ర్యాంకు దక్కింది. భారత్ పాస్ పోర్టుతో 62 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments