Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్ఫోసిస్ నారాయణ మూత్రి - సుధ దంపతుల పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?

Advertiesment
info narayana murthy

ఠాగూర్

, గురువారం, 11 జనవరి 2024 (14:00 IST)
ఐటీ రంగంలో భారత ఖ్యాతిని  విశ్వవ్యాప్తం చేసిన వారిలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఒకరు. ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించిన తొలి నాళ్లలో ఆయన పడిన కష్టాలు అన్నీఇన్నీకావు. ఈ విషయాన్నీ ఇటీవల విడుదలైన ఆయన ఆత్మకథ 'యాన్ అన్కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి"లో వెల్లడించారు. ఇందులో తమ పెళ్లి ఖర్చును నారాయణ మూర్తి చెప్పారు. వీరిద్దరి పెళ్లి ఖర్చు కేవలం రూ.800 మాత్రమేనంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ విషయాన్ని సుధామూర్తి స్వయంగా వెల్లడించారు.
 
వివాహాన్ని నిరాడంబరంగా చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ చెరో రూ.400 ఖర్చు చేసి పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు, ఈ పెళ్లికి హాజరైన అతిథులు కూడా ఏడుగురేనంటే మరింత ఆశ్చర్యం వేస్తుంది. పెళ్లి సమయంలో నారాయణమూర్తి కుటుంబ సభ్యులు రూ.300 ఇస్తామని, చీర కావాలా? మంగళసూత్రం కావాలా? అని అడిగితే సుధామూర్తి మంగళసూత్రం కావాలని అడిగారట. దీంతో అరగంటలోనే పెళ్లి పూర్తయింది. అప్పట్లో మూర్తి దగ్గర డబ్బులు లేకపోయేవని, దీంతో తానే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చేదని సుధామూర్తి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
 
నారాయణమూర్తి మాట్లాడుతూ.. సుధను ఇన్ఫోసిస్‌కు దూరం పెట్టి చాలా తప్పుచేశానని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి సంస్థలోని ఆరుగురు వ్యవస్థాపకులు, తన కంటే కూడా ఆమే ఎక్కువ అర్హురాలని చెప్పారు. మంచి కార్పొరేట్ పాలన అంటే కుటుంబ సభ్యులను సంస్థకు దూరంగా ఉంచడమేనని అనుకునేవాడినని, ఆ రోజుల్లో వారసులు వచ్చి సంస్థ నిబంధనలు ఉల్లంఘించేవారని గుర్తు చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా బిడ్డను నేను హత్య చేయలేదు.. నిద్ర లేచేసరికి చనిపోయివున్నాడు... సుచనాసేర్..