తన బిడ్డను తాను హత్య చేయలేదని, నిద్ర నుంచి లేసేసరికి అతను చనిపోయివున్నాడని మైండుల్ ఏఐ సంస్థ సీఈవో సుచనా సేథ్ వెల్లడిచాయి. అయితే, బిడ్డను చంపిన కేసులో కర్నాటక పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. గోవాలో తన నాలుగేళ్ల కుమారుడిని చంపి, సూటుకేసులో మృతదేహాన్ని తరలిస్తూ ఆమె పోలీసులకు చిక్కారు. ఆమె వద్ద జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆమె భర్త వెంకటరత్నం తన కుమారుడితో గడిపేందుకు కోర్టు అనుమతించడమే హత్యకు దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు. 2022లో దంపతుల విడాకుల ప్రక్రియ ప్రారంభమైంది. కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో భర్త ప్రతి ఆదివారం తన తనయుడితో ఉండేందుకు న్యాయస్థానం అనుమతించింది.
ఈ ఉత్తర్వులు సుచనాను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అందుకే బాలుడిని చంపేందుకు నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. సుచనాను మరింత విచారించేందుకు ఆమెను గోవా కోర్టు 6 రోజులు పోలీసు కస్టడీకి అప్పగించింది.
కాగా, చిన్నారికి ఎక్కువ పరిమాణంలో దగ్గుమందు ఇచ్చి తలదిండు లేదా టవల్‌తో బాలుడి గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
హోటల్ రూంలో తనిఖీలు నిర్వహించగా ఒక పెద్ద, చిన్న దగ్గు మందు సీసాలు కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తనకు దగ్గు వస్తోందని, ఒక సిరప్ సీసా కొని తేవాలని హోటల్ సిబ్బందిని సుచనాసేర్ కోరినట్లు చెప్పారు.
అయితే తాను ఈ హత్య చేయలేదని, నిద్రనుంచి లేచేసరికే కుమారుడు చనిపోయి ఉన్నాడని ఆమె చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, పోస్టుమార్టం పరీక్ష అనంతరం బాలుడి మృతదేహాన్ని అతడి తండ్రికి అప్పగించారు.