Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోటీ మాడ్చిందని తలాక్‌ చెప్పేశాడు.. ఎక్కడ?

ముస్లిం సంప్రదాయంలో ఉన్న తలాక్ విధానంతో ఆ మతానికి చెందిన మహిళలు అన్యాయంగా బలైపోతున్నారు. చిన్నవిషయానికే కట్టుకున్న భర్తలు తమకు తలాక్ చేప్పేస్తున్నారు. దీంతో అనేక మంది ముస్లిం మహిళలు నడిరోడ్డుపై పడుతున

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (08:59 IST)
ముస్లిం సంప్రదాయంలో ఉన్న తలాక్ విధానంతో ఆ మతానికి చెందిన మహిళలు అన్యాయంగా బలైపోతున్నారు. చిన్నవిషయానికే కట్టుకున్న భర్తలు తమకు తలాక్ చేప్పేస్తున్నారు. దీంతో అనేక మంది ముస్లిం మహిళలు నడిరోడ్డుపై పడుతున్నారు. 
 
తాజాగా భార్య పొరపాటున రోటీ మాడ్చిందనే కారణంతో ఓ భర్త తలాక్‌ ఇచ్చాడు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా పహరేతా గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఓ యువతి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తరచూ వేధిస్తున్నాడని, సిగరెట్లతో శరీరంపై వాతలు పెట్టేవాడని వాపోయింది. వంట చేసే సందర్భంలో రోటీలు కొంచెం మాడాయని.. ఆగ్రహించిన భర్త తలాక్‌ చెప్పాడని ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 
 
కాగా, ట్రిపుల్ తలాక్ రద్దు చేసే విషయంపై కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు శాయశక్తులా కృషి చేస్తున్న విషయం తెల్సిందే. ఈ అంశం ఇపుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలన్న పట్టుదలతో కేంద్రం ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments