Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే శాఖలో కరోనా మరణమృదంగం - రోజుకు 150 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (08:22 IST)
భారతీయ రైల్వే శాఖలో కరోనా వైరస్ మరణమృదంగం కొనసాగిస్తోంది. ఈ వైరస్ బారినపడిన రైల్వే సిబ్బందిలో రోజుకు 150 మంది వరకు మృత్యువాతపడుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో సునీత్ శర్మ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రైల్వేలోని 12 లక్షల మంది సిబ్బందిలో 7.50 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు. అలాగే, ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 2,400 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. 
 
కాబట్టి రైల్వే ఉద్యోగులను ప్రాధాన్య జాబితాలో చేర్చి టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్టు చెప్పారు. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రైల్వే ఆసుపత్రులలో వెంటిలేటర్లు, పడకలు పెంచడంతోపాటు ఆక్సిజన్ ప్లాంట్లను కూడా నెలకొల్పినట్టు తెలిపారు.
 
ముంబై - హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ తయారీలోనే ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కరోనా ఆంక్షల వల్ల రైళ్లను పూర్తిస్థాయిలో నడపలేకపోతున్నామని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 889 ప్రత్యేక రైళ్లు, 479 ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నట్టు సునీత్ శర్మ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments