Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు.. వరుడికి రూ.11కట్నం.. మాలలు మార్చుకుని వధువును ఇంటికి తీసుకెళ్లిపోయాడు..

నోట్ల రద్దు కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు ప్రభావం వివాహాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. డబ్బులు లేక కొంతమంది పెళ్లిని వాయిదా వేసుకుంటుంటే మరికొందరు ఉన్న డబ్బుతో పెళ్ల

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (14:41 IST)
నోట్ల రద్దు కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దు ప్రభావం వివాహాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. డబ్బులు లేక కొంతమంది పెళ్లిని వాయిదా వేసుకుంటుంటే మరికొందరు ఉన్న డబ్బుతో పెళ్లి కానిచ్చేస్తున్నారు. తాజాగా గ్రేటర్‌ నోయిడాకు చెందిన మహవీర్‌ సింగ్‌, గ్యానో దంపతుల కుమార్తె సంజు వివాహం ఆదివారం రాత్రి జరిగింది. 
 
నగదు కొరత నేపథ్యంలో పెళ్లి ఎలా జరపాలని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా పెళ్లాడడానికి వరుడు అంగీకరించడంతో వారు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న యోగేశ్‌ సంతోషంగా వధువుని తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయాడు. కొంతమంది గ్రామ యువకులు ముందుకు వచ్చి డీజేను ఏర్పాటు చేయడంతో ఊరిలో పెళ్ళి సందడి ఏర్పడింది. 
 
గ్రామస్తుల సహకారంతో వివాహం అత్యంత నిరాడంబరంగా జరిపించారు. వివాహ వేడుకకు కొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించి వారికి తేనీరు మాత్రమే ఇచ్చారు. వధూవరులు దండలు మార్చుకొని వివాహ తంతు ముగించారు. పెళ్లికి వచ్చిన పెద్దలు వరుడికి రూ.11 మాత్రమే కట్నంగా చదివించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments