Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేఘాలయా అసెంబ్లీ ఫలితాలు : కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదా?

తాజాగా వెల్లడైన మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 21 సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కనిపించడం లేదు. ఎందుకంటే మొత్తం 60 సీట్లు

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (16:00 IST)
తాజాగా వెల్లడైన మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 21 సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కనిపించడం లేదు. ఎందుకంటే మొత్తం 60 సీట్లున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 31 సీట్లు కావాల్సి ఉంది. 
 
మణిపూర్, గోవా తరహాలో బీజేపీ కూటమి మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 21 శాసనసభ స్థానాలను దక్కించుకుంది. కనీసం 31 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది.
 
మరోవైపు అయినప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేతలు శనివారం రాత్రి గవర్నర్‌‌ను కలిసి అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కాగా, బీజేపీ మిత్ర పక్షం ఎన్‌పీపీకి యూడీపీ మద్దతు ప్రకటించింది. యూడీపీ చీఫ్ సంగ్మాతో చర్చలు జరిపేందుకు ఆయన నివాసానికి బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ వెళ్ళారు. 
 
ఈ ఎన్నికల్లో బీజేపీకి 2, ఎన్‌‌పీపీకి 19, యూడీపీకి 6 స్థానాలు లభించాయి. ఈ మూడు పార్టీలు కలిసి, మరికొందరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద కాంగ్రెస్‌‌ను నిరోధించి, మేఘాలయను దక్కించుకునేందుకు ఎన్డీయే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments