Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఇక 21 ఏళ్ల వారూ మద్యం తీసుకోవచ్చు

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (10:28 IST)
అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం మద్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించేందుకు అవసరమైన చట్టబద్ధ వయస్సును 25 ఏళ్ల నుండి 21 ఏళ్లకు కుదించినట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా వెల్లడించారు.

నూతన మద్యం పాలసీ ప్రకటన చేసిన ఆయన.. ఈ మార్పుల వల్ల వార్షిక ఎక్సైజ్‌ రెవెన్యూ 20 శాతం పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. కొంత మంది మంత్రుల సిఫార్సు మేరకు ఈ నూతన మద్యం పాలసీకి క్యాబినేట్‌ ఆమోద ముద్ర వేసిందని అన్నారు.

అయితే ఢిల్లీలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయకూడదని, అదేవిదంగా కొత్త వాటిని అనుమతులివ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుక్నుట్లు చెప్పారు. ప్రస్తుతం 60 శాతం లిక్కర్‌షాపులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని అన్నారు.

ఈ మార్పులతో నగరంలో లిక్కర్‌ మాఫియాకు కళ్లెం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో 850 మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, కానీ లిక్కర్‌ మాఫియా 2వేలకు పైగా అక్రమంగా దుకాణాలను నడుపుతుందని అన్నారు.

గత రెండేళ్లలో సుమారు 7 లక్షల అక్రమ లిక్కర్‌ బాటిళ్లను సీజ్‌ చేశామని, 1939 మంది నిందితులు అరెస్టు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments