Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి రూ.250 కోట్లు... బీఆర్ఎస్‌కు రూ.90 కోట్ల విరాళాలు..

ఠాగూర్
గురువారం, 4 జనవరి 2024 (14:03 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి విరాళాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారు. ఫలితంగా గత 2022-23 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి ఏకంగా రూ.250 కోట్ల మేరకు విరాళాలు వచ్చాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో 70 శాతం విరాళాలు కాషాయం పార్టీ ఖాతాల్లోకి చేరడం గమనార్హం. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీకి రూ.90 కోట్ల విరాళాలు వచ్చాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం బీజేపీ తర్వాత అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీల్లో భారాస రెండో స్థానంలో ఉంది. అలాగే, ఏపీలోని మరో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.17.40 కోట్లు వచ్చాయి. 
 
2022-23లో మొత్తం రూ.363 కోట్లకు పైగా విరాళాల రూపంలో రాజకీయ పార్టీలకు అందాయని ఎలక్ట్రోరల్ ట్రస్టుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. 39 కార్పొరేట్, బిజినెస్ హౌస్‌ల నుంచి ఈ విరాళాలు అందినట్టు పేర్కొంది. 34 కార్పొరేట్, వ్యాపార సంస్థలు ఫ్రూడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌కు రూ.360 కోట్లు, సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు ఒక కంపెనీ నుంచి రూ.2 కోట్లు, పరిబర్తన్ ఎలక్టోరల్ ట్రస్ట్‌‍కు 2 కంపెనీలు రూ.75.50 లక్షలు, ట్రింప్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు 2 కంపెనీలు రూ.50 లక్షలు విరాళంగా అందించాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments