Webdunia - Bharat's app for daily news and videos

Install App

IMA: బాబా రాందేవ్‌పై కేసు నమోదు చేయండి, ఏమైంది?

Webdunia
శనివారం, 22 మే 2021 (17:59 IST)
దిల్లీ: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ అల్లోపతి వైద్య శాస్త్రం, వైద్యులను అవమానించేలా మాట్లాడారని భారత వైద్య సంఘం (ఐఎంఏ) ఆరోపించింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ తక్షణం స్పందించి ఆయనపై కేసు నమోదు చేయాలని ఐఎంఏ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఐఎంఏ సామాజిక మాధ్యమాల్లో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

కరోనా కాలంలో ఎన్నో ఒడిదొడుకులకు గురవుతూ, వైద్యులు శ్రమిస్తుంటే ఈ విధమైన నిందలు తగవని ఆ ప్రకటనలో పేర్కొంది. బాబా రాందేవ్‌పై కేసు నమోదు చేయకుంటే ఆధునిక వైద్య శాస్త్రాన్ని రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఐఎంఏ నాయకులు కోరారు. లేదంటే అంటువ్యాధుల చట్టం కింద బాబా రాందేవ్‌పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయడం ద్వారా ఆరోగ్య కార్యకర్తలు, రోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు.
 
తాజాగా బాబా రాందేవ్‌ ఆధునిక వైద్యశాస్త్రాన్ని, వైద్య విధానాలను అవమానించే విధంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గతంలో కూడా బాబా రాందేవ్‌ ఆధునిక వైద్యులను హంతకులుగా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రజలు ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతుంటే ‘వారికి సరిగా శ్వాస తీసుకోవడం కూడా రావట్లేదు’ అంటూ ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments